ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు పోటీగా మెగా సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది paytm మాల్. ‘మెరా క్యాష్ బ్యాక్’ పేరుతో ఈ మెగా సేల్ ఈవెంట్ ప్రారంభించబోతుంది. ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ ఈవెంట్ నిర్వహించనుంది paytm మాల్.
ఈవెంట్‌లో భాగంగా రూ.501 కోట్ల క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. కొత్తగా 50 లక్షల మంది కస్టమర్లను ఆకర్షించాలనే లక్ష్యంగా ఈ సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పింది కంపెనీ. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, ఫ్యాషన్ ప్రొడక్టులు, ఇతర ఉత్పత్తులపై 15 శాతం నుంచి 100 శాతం వరకు paytm మాల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. స్మార్ట్‌ఫోన్లపై రూ.15వేల వరకు, ల్యాప్‌టాప్‌లపై రూ.20వేల వరకు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది.
25 మంది ఫోన్ కొనుగోలుదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను బహుమతిగా అందించనుంది. నాలుగు రోజుల సేల్‌లో భాగంగా ప్రతి రోజూ 200 మంది వినియోగదారులకు 100 గ్రాముల గోల్డ్‌ను కూడా బహుమతిగా ప్రకటించింది paytm. తొలి పండుగ సేల్ ఇదేనని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా తెలిపారు. తమ భాగస్వామ్య బ్రాండులు, మెర్చంట్లతో కలిసి క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించనున్నట్టు చెప్పారు.
ఆపిల్, జేబీఎల్, ఉడ్‌ల్యాండ్, టైమెక్స్‌లు ఈ సేల్‌లో టాప్ బ్రాండులుగా ఉన్నాయి. అమ్మకాలు పెంచుకోవడానికి రిటైలర్లతో కూడా paytm మాల్ ఒప్పందం చేసుకుంది.

No comments:
Post a Comment