Search This Blog

Saturday, 23 September 2017

రేపటి నుంచి జియో ఫోన్ల డెలివరీ


ఇంటర్నెట్ సేవలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. మొబైల్ ఫోన్లను కూడా అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 24న ప్రారంభమైన బుకింగ్ లు.. సరిగ్గా నెల తర్వాత అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలో సుమారు 60 లక్షల మంది జియో ఫోన్లను బుక్ చేసుకున్నారు. ఈ ఫోన్ల డెలివరీ ఆదివారం(సెప్టెంబర్ 24) నుంచి ప్రారంభంకానుంది. తొలి విడతలో బుకింగ్‌ అయిన ఫోన్లను 15 రోజుల వ్యవధిలోనే డెలివరీ చేయనుంది జియో.
మొదట్లో అక్టోబర్ 1 నుంచి.. అనుకున్నా.. తర్వాత దసరా ముందుగానే ఫోన్లను డెలివరీ చేయనున్నట్టు చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. దీనిపై జియో ప్రత్యేక ప్రకటన చేయకున్నా.. మార్కెట్లో జోరుగా వార్తలు సాగుతున్నాయి.  గ్రామీణ ప్రాంతాలతో మొదలు పెట్టి మెట్రో సిటీలకు ఫోన్లు డెలివరీ చేయనున్నట్టు సమాచారం.
500 రూపాయలు (ఫోన్‌ ధర రూ.1,500) చెల్లించి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ను బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. డెలివరీ సందర్భంగా మిగతా 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుం ది. దాదాపు 60 లక్షల ఫోన్ల బుకింగ్స్‌ జరగడంతో వీటి బుకింగ్స్‌ను జియో నిలిపివేసింది. మళ్లీ ఎప్పుడు బుకింగ్స్‌ ప్రా రంభించే విషయాన్ని రిలయన్స్‌ జియో ప్రకటించలేదు.

No comments:

Post a Comment

Developed By SRK. Powered by Blogger.