ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ బీటా వెర్షన్‌కు చెందిన కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఈ ఫీచర్ లభిస్తుంది. దీని సహాయంతో వాట్సాప్ లో మీడియా ఫైల్స్ స్టోరేజ్‌ను మేనేజ్ చేయవచ్చు. వాట్సాప్‌లో కాంటాక్ట్స్ ద్వారా వచ్చే టెక్ట్స్ మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు డివైస్‌లో ఎంత స్టోరేజ్‌ను ఆక్రమించాయో తెలుసుకోవచ్చు. దీంతో అవసరం లేదని ఫైల్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్‌ను వాడుకోవాలంటే వాట్సాప్ ను ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోని డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్‌లోకి వెళ్లి స్టోరేజ్ యూసేజ్ ఆప్షన్‌ను ప్రెస్ చేయాలి. వాట్సాప్‌లో వచ్చే ఫైల్స్ డివైస్‌లో ఎంత స్టోరేజ్‌ను వాడుకుంటున్నాయో చూపిస్తుంది. దాన్ని బట్టి కింద ఉండే డిలీట్ ఆప్షన్ ద్వారా అవసరం లేని ఫైల్స్‌ను డిలీట్ చేయవచ్చు. డివైస్‌లో స్టోరేజ్ స్పేస్ పెరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌లోనే అందుబాటులో ఉండగా త్వరలో సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. IOSలో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

No comments:
Post a Comment