Search This Blog

Monday, 18 September 2017

పాకెట్ ప్రింటర్ : చిటికెలో ఫొటో మీ చేతిలో

భారీగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ల వినియోగం, సెల్ఫీలపై యువత  మోజు క్రమంలో ‘స్ప్రోకెట్‌’  పేరుతో ఓ కొత్త  పాకెట్‌ ప్రింటర్‌ను తయారు చేసింది ప్రముఖ ప్రింటర్ల తయారీ సంస్థ HP. స్మార్ట్‌ఫోన్‌ కోసం ప్రత్యేకంగా  రూపొందించిన ఈ బుల్లి ప్రింటర్ ధర రూ.8వేల 999. ఈ సరికొత్త ప్రింటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది హెచ్ పీ సంస్థ.
ముఖ్యంగా 10 నుంచి 24 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న లక్షలాది మంది వినియోగదారుల కోసం రూపొందించామని ప్రకటించారు HP ఇండియా  ప్రింటింగ్ సిస్టమ్స్  సీనియర్ డైరెక్టర్ రాజా కుమార్ రిషి. దీని ద్వారా  వినియోగదారులు వారి అద్భుతమైన జ్ఞాపకాలను తక్షణమే ప్రింట్  చేసుకోవచ్చన్నారాయన. మార్కెట్లో లభ్యమవుతున్న అత్యధిక పోలరాయిడ్ కెమెరాల బడ్జెట్‌ ధరలతో  పోలిస్తే హెచ్‌పీ పాకెట్‌ ప్రింటర్‌ ఎక్కువ ధర  ఉన్నప్పటికీ, స్మార్ట్‌ఫోన్లకు ఇది బాగా లాభిస్తుందని భావిస్తున్నారు.
వినియోగదారులు ఆపిల్ యాప్ స్టోర్,  గూగుల్ యొక్క ప్లే స్టోర్ నుంచి అధికారిక స్ప్రోకెట్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి.  బ్లూటూత్‌ ద్వారా దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌  ద్వారా కొనుగోలు చేయవచ్చు.  ప్రస్తుతం ఎరుపు, నలుపు , తెలుపు రంగుల్లో లభిస్తుంది ఈ ప్రింటర్.


No comments:

Post a Comment

Developed By SRK. Powered by Blogger.