Referral Link : https://g.co/tez/iO7wl
గూగుల్ పేమెంట్ యాప్ వచ్చేసింది. టెజ్(Tez) లాంచ్ చేసింది. UPI ఐడీ, QR కోడ్, ఫోన్ నెంబర్, బ్యాంకు అకౌంట్ల ద్వారా యూజర్లు తమ నగదును ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, IOS రెండు డివైజ్‌లకు గూగుల్ Tez అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ నుంచి బ్యాంక్ కి కానీ, బిల్లుల చెల్లింపులకు కానీ ఈ యాప్ ఉపయోగపడనుంది. నగదు లావాదేవీలకు అత్యంత సెక్యురిటీ ఉన్న యాప్ ఇదేనంటోంది గూగుల్. దేశీయ దిగ్గజ బ్యాంకులతో పాటు, డామినోస్, రెడ్‌బస్, పీవీఆర్‌లను తమ పేమెంట్ పార్టనర్లుగా చేర్చుకుంది. అదనంగా బిజినెస్ యూజర్ల కోసం కూడా ఈ యాప్‌ను ప్రారంభించింది. ఎలాంటి ఫీజులు లేకుండా నేటి నుంచి డిజిటల్ పేమెంట్లను అంగీకరించడం ప్రారంభించవచ్చని గూగుల్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
Tez యాప్ తో ప్రయోజనాలు..
.. వినియోగదారుడి అకౌంట్ నుంచి డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. UPI ద్వారా Tez ను బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసుకుంటే సులభంగా మనీ ట్రాన్స్ ఫర్ లు జరపవచ్చు.
.. అకౌంట్ సెక్యురిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటోంది గూగుల్. అన్ని రకాలుగా భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపింది.
.. నగదు లావాదేవీలకు సంబంధించి పర్సనల్ అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్ షేర్ చేసుకోవలసిన అవసరం లేదు.
.. తెలుగు, తమిళ, హిందీ, బెంగాళి, గుజరాతీ, కన్నడ, వంటి భాషలకు ఈ యాప్ సహకరిస్తోంది.
.. అలర్ట్‌లు, నోటిఫికేషన్, వెరిఫికేషన్‌లు పొందడానికి అవకాశముంది. దీని కోసం గూగుల్ అకౌంట్‌ను ఎంపికచేసుకోవాలి
.. యాక్సిస్ బ్యాంకు, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, ఎస్‌బీఐ వంటి వాటితో గూగుల్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకునూ ఇది సపోర్టు చేస్తుంది.
రివార్డులు…
.. ప్రతి ట్రాన్ సాక్షన్స్ పై రివార్డులు కూడా అందజేస్తోంది. ప్రతి ట్రాన్ సాక్షన్ పై రూ.1000 నగదు అందించగా… వారానికి లక్ష రూపాయలు అందించనుంది. ప్రతి ఆదివారం విజేతల వివరాలు తెలియజేస్తారు.

No comments:
Post a Comment