సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌ను విడుదల చేసింది గూగుల్. ‘ఆండ్రాయిడ్ 8.0 ఓరియో’ పేరుతో రిలీజ్ చేసిన కొత్త వెర్షన్ పై అప్పుడే దృష్టిపెట్టారు నెటిజన్లు. ఓరియో అంటే ఓ స్వీట్ పేరు. గతంలోను ఇలాగే పేర్లు పెట్టింది గూగుల్. ఆండ్రాయిడ్ 1.5 కప్‌కేక్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఈ సంప్రదాయానికి చెందినవే. కొత్తగా విడుదల చేసిన ఆండ్రాయిడ్ 8.0 ఓరియోలో ఎన్నో అధునాతన ఫీచర్లు, టూల్స్ ఉన్నాయి. కొత్త ఎమోజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఒకేసారి రెండు యాప్స్‌ను ఉపయోగించే విధంగా ఈ ఓఎస్‌ను అభివృద్ధి చేశారు. యూజర్ తన ఫోన్ నెంబర్లు, పాస్‌వర్డ్ తదితర విషయాలను ఎంటర్ చేసే సమయంలో వాటిని స్టోర్ చేయాలా? వద్దా? అనే ఆప్షన్ బటన్‌ను ఉంచారు. దీనిని క్లిక్ చేస్తే సదరు సమాచారం స్టోర్ అవుతుంది. భవిష్యత్‌లో కావాలనుకున్నప్పుడు వివిధ యాప్స్‌లోనూ , వెబ్‌సైట్లలోనూ ఆ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. దాదాపు 60 విభిన్న రకాల ఎమోజీలను ఈ ఓస్‌లో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 8.0ఓరియో వల్ల బ్యాటరీ వినియోగం కూడా తక్కువగా ఉంటుందని సంస్థ వర్గాలు తెలిపాయి.
అయితే ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రోజెక్టులో భాగంగా బీటా వెర్షన్‌ను మాత్రమే విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే పిక్సెల్, నెక్సాస్ 5ఎక్స్, నెక్సాస్6పీ, పిక్సెల్ సీ మొబైల్ వినియోగదారులకు అప్‌డేట్స్ వస్తాయని వెల్లడించారు. బీటా వెర్షన్ ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతం ఈ వెర్షన్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

No comments:
Post a Comment