Search This Blog

Tuesday, 22 August 2017

షియోమీ రెడ్‌మీ నోట్ 5ఎ విడుద‌ల


మొబైల్స్ త‌యారీదారు షియోమీ న్యూ స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మీ నోట్ 5ఎ’ను సోమవారం (ఆగస్టు21)న విడుదల చేసింది. స్టాండ‌ర్డ్‌, హై ఎండ్ పేరిట రెండు వేరియెంట్ల‌లో ఈ ఫోన్ విడులైంది. రూ.8,645, రూ.11,530 ధ‌ర‌ల‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది. మంగళవారం (ఆగస్టు22) నుంచి చైనాలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. తర్వాత ఇండియాలోనూఈ ఫోన్ ల‌భిస్తుంది. కాగా ఈ రెండు వేరియెంట్లలోనూ డెడికేటెడ్ మెమొరీ స్లాట్‌ను ఇచ్చారు. ఒకేసారి రెండు సిమ్ కార్డులు, ఒక మైక్రో ఎస్‌డీ కార్డును ఫోన్‌లో వేసుకోవ‌చ్చు.
షియోమీ రెడ్‌మీ నోట్ 5ఎ స్టాండ‌ర్డ్‌ వేరియెంట్ ఫీచ‌ర్లు…
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.
షియోమీ రెడ్‌మీ నోట్ 5ఎ హై ఎండ్ వేరియెంట్ ఫీచ‌ర్లు…
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 435 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

No comments:

Post a Comment

Developed By SRK. Powered by Blogger.