ఒకే ఒక్క జియో ఫోన్.. టెలికాం రంగాన్ని ఊపేస్తోంది. జియో ఫోన్ మరికొన్ని రోజుల్లో ప్రజల చేతుల్లోకి రాబోతున్న టైంలో.. కస్టమర్లను కాపాడుకునేందుకు ఎయిర్ టెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి నాటికి జియోకు పోటీగా అతి తక్కువ ధరలో 4G ఫోన్ ను మార్కెట్ లో లాంఛ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది. దీని ధర కేవలం రూ.2వేల 500. ఇప్పటికే మొబైల్ తయారీ సంస్థలతో చర్చలు జరిపిన ఎయిర్ టెల్.. శరవేగంగా మార్కెట్ లోకి విడుదల చేయటానికి చకచకా అడుగులు వేస్తోంది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫొన్ తయారవుతోంది. గూగుల్ ప్లే స్టోర్ లోని యాప్స్ ను కస్టమర్లు డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఉంటుంది. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తారు. దీన్ని టెల్కో ప్రమోట్ చేయనుంది. జియో ఫోన్ కంటే మెరుగ్గా ఉండాలని ఎయిర్ టెల్ నిర్ణయించింది. కెమెరా క్వాలిటీ, బ్యాటరీ సామర్ధ్యం, డిస్ ప్లే స్క్రీన్ ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేస్తోంది. టెక్నాలజీ విషయంలోనూ అన్ని యాప్స్ సపోర్ట్ చేసేందుకు టెక్నాలజీ నిపుణులతో చర్చిస్తోంది. ఈ చర్చల ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.
మొబైల్ తయారీ కంపెనీలతో చర్చలు తుది దశలో ఉన్నాయని ఎయిర్ టెల్ ప్రకటించింది. రూ.2,500 ధరలో 4G నెట్ వర్క్ తో పని చేసే హ్యాండ్ సెట్స్ అందించటానికి లావా, కార్బన్ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. మరికొన్ని కంపెనీలతోనూ ఒప్పందం చేసుకోవటానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. జియోకు గట్టిపోటీ అయితే ఇవ్వాలని నిర్ణయించామని.. విడుదల తేదీని ఇప్పుడు ప్రకటించలేం అని తెలిపింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మార్కెట్ లోకి జియో 4జీ ఫోన్ వస్తుందని.. ఈ పోటీని తట్టుకునేందుకు వీలైనంత త్వరలోనే వస్తామని ధీమా వ్యక్తం చేసింది ఎయిర్ టెల్. దీపావళి నాటికి జియోకి పోటీగా ఎయిర్ టెల్ ప్లాన్, ఫోన్ రెడీగా ఉండొచ్చని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఎయిర్ టెల్.

No comments:
Post a Comment