పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ఆలస్యాన్ని తగ్గించేందుకు కొత్త విధానాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎస్) సహాయంతో వెరిఫికేషన్ ప్రకియను త్వరితగతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పాస్‌పోర్టు సర్వీసుతో సీసీటీఎన్‌ఎస్‌ను అనుసంధానం చేసి ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రీషి.
ఈ నూతన విధానంలో పోలీసు అధికారులకు ట్యాబ్‌లను అందిస్తారు. వీటిని తీసుకుని పాస్‌పోర్టు దరాఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను అక్కడే నమోదు చేసి అప్‌లోడ్ చేస్తారు. తద్వారా డాక్యుమెంట్లు, ఇతర కాలయాపన లేకుండా ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు మెహ్రీషి . ప్రభుత్వం తదనుగుణంగా క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలు, నేరస్తుల వేలి ముద్రలు, జైళ్లశాఖ, జువైనల్ హోం వివరాలను సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానం చేయనుందన్నారాయన. సీసీటీఎన్‌ఎస్ అనేది నేర విభాగ వివరాలు నమోదు చేసుకునే సంస్థ. దీనిని 2009లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న 15,398 పోలీస్‌స్టేషన్లలో 14,284 పోలీస్‌స్టేషన్లు సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానించి ఉన్నాయి. ఇప్పటి వరకు 2.5కోట్ల ఎఫ్.ఐ.ఆర్ వివరాలు ఇక్కడ నిక్షిప్తం చేశారు.

No comments:
Post a Comment