Search This Blog

Wednesday, 13 September 2017

ఫీచర్స్ అదిరిపోయాయి: ఐఫోన్ X వచ్చేసింది

ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం (సెప్టెంబర్12)  ‘ఐఫోన్‌ ఎక్స్‌ (ఐఫోన్‌ 10)’ పేరిట తన తాజా సంచలనాన్ని మార్కెట్‌కు పరిచయం చేసింది. వీటితో పాటు ఐఫోన్‌8, ఐఫోన్‌8 ప్లస్‌ పేరిట మరో రెండు మోడళ్లను కూడా విడుదల చేసింది. ఐఫోన్‌ 10ను యాపిల్‌ అధినేత టిమ్‌ కుక్‌ విడుదల చేయటం విశేషం.
ఐఫోన్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ ఫోన్లు వచ్చేశాయి. కొత్త ఐఫోన్‌ సిరీస్‌కు సంబంధించి టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన తాజా ఫోన్లను మంగళవారం (సెప్టెంబర్12) మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఐఫోన్‌ ఎక్స్‌ (ఐఫోన్‌ 10) పేరుతో తన తాజా సంచలనాన్ని మార్కెట్ కు పరిచయం చేసింది. వీటితో పాటు ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8+ మరో రెండు మోడళ్లను కూడా విడుదల చేసింది. ఐఫోన్‌ 10ను యాపిల్‌ అధినేత టిమ్‌ కుక్‌ విడుదల చేశారు.
 ఈ మోడళ్ల ఫీచర్స్..
ఐఫోన్‌ ఎక్స్‌(ఐఫోన్‌ 10):


ఐఫోన్‌ టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ ఫోన్‌.. యాపిల్‌ ఇప్పటిదాకా విడుదల చేసినవాటన్నిటిలోకీ మెరుగైనది. 5.8 అంగుళాల సూపర్‌ రెటీనా OLED డిస్‌ప్లే తెర, డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ దీని ప్రత్యేకతలు. ఫుల్‌ స్ర్కీన్‌ డిస్‌ప్లే ఉంటుంది.3 డి స్కానర్లు,3సెన్సార్లు గత మోడళ్లలో లేని ప్రత్యేకత ఇందులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఫోన్లను అన్ లాక్ చేయాలంటే చేతి వేలిముద్ర లేదా.. బటన్ వినియోగించేవారు. ఐఫోన్ టెన్ లో మాత్రం యజమాని ఫోన్ ను తన ముఖానికి ఎదురుగా ఉంచుకుని..కళ్లతో చూస్తే చాలు అన్ లాక్ అవుతుంది. అంటే వినియోగదారుడి ముఖాన్ని గుర్తించే ఫేస్‌ ఐడీ పరిజ్ఞానం ఇందులో స్పెషల్. వైర్ లెస్ ఛార్జింగ్ కూడా దీని ప్రత్యేకతే.12 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరాలు,64GB నుంచి ప్రారంభమయ్యే ఐఫోన్ 10 ధర రూ.63 వేల పైమాటే. పన్నులు కలుపుకొంటే చాలా ఎక్కువ ఉంటుంది.


ఐఫోన్‌ 8+ ఫీచర్స్:
5.5 అంగుళాల స్క్రీన్, వైడ్‌యాంగిల్‌ లెన్స్‌, టెలిఫొటో లెన్స్‌తో కూడిన 12-మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ కెమెరా దీని ప్రత్యేకతలు. దీంట్లో ఉండే పోర్ట్రయిట్‌ లైటింగ్‌ అనే ఫీచర్‌.. పోర్ట్రయిట్‌ మోడ్‌లో ఫొటోలు తీస్తున్నప్పుడు అక్కడి వాతావరణానికి అనుగుణంగా వెలుగును సరిచేస్తుంది. 64GB, 256 GB వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు రూ.51 వేల నుంచి మొదలవుతుంది. మనదేశంలో పన్నులన్నీ కలుపుకొంటే ధర భారీగానే ఉండనుంది.
ఐఫోన్‌ 8 ఫీచర్స్:
4.7 అంగుళాల స్క్రీన్, వెనకవైపు 12 మెగాపిక్సెల్‌ కెమెరా. 1080పి హెచ్‌డీ నాణ్యతతో స్లోమోషన్‌ వీడియోలను, 4కే వీడియోలను దీంతో తీయవచ్చు. దీంట్లో ఏ11 బయోనిక్‌ చిప్‌.. ఇప్పటిదాకా వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో ఉన్న అన్నింటికన్నా అత్యంత శక్తిమంతమైనదని యాపిల్‌ చెబుతోంది. వైర్‌లెస్‌ చార్జింగ్‌ సదుపాయం ఉంది. 64GB కలిగిన ఈ ఫోన్ ధర రూ.45 వేల నుంచి మొదలవుతుంది.
ఐఫోన్‌ 8 మోడళ్లు రెండూ సిల్వర్‌, స్పేస్‌ గ్రే రంగులతోపాటు.. కొత్తగా గోల్డ్‌ కలర్‌లో కూడా లభ్యమవుతాయి.

No comments:

Post a Comment

Developed By SRK. Powered by Blogger.