Search This Blog

Thursday, 24 August 2017

లంబోర్గిని కొత్త ఫోన్‌.. ధర అదిరింది



ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల ఉత్పత్తుల సంస్థ లంబోర్గిని.. స్మార్ట్‌ఫోన్‌ రంగంలోనూ అడుగుపెట్టింది. తన బ్రాండ్‌కు తగ్గట్లుగా లగ్జరీ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి కొన్ని మోడళ్లు అంతర్జాతీయ మార్కెట్లోకి రాగా.. తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘ఆల్ఫా వన్‌’ పేరుతో మరో లగ్జరీ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర 2450 డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు 1.57లక్షలు. ప్రస్తుతం ఈ ఫోన్‌ యూకే, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మార్కెట్లోకి వచ్చింది.
ఫోన్‌ వెనుక భాగాన్ని ఐరన్‌తో కాకుండా.. ఇటాలియన్‌ బ్లాక్‌ లెదర్‌తో తయారుచేశారు. దీంతో పాటు కంపెనీ లోగోను కూడా ముద్రించారు. ఫోన్‌తో పాటు ఇటాలియన్‌ లెదర్‌ ఫోన్‌ కేస్‌ కూడా వస్తుంది. ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్లో అన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ఆల్ఫా వన్‌ ఫీచర్లు
* 5.5 అంగుళాల డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్‌ 7.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* 4జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం
* 20మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* 8మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
* ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ సదుపాయం
* 3250ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

No comments:

Post a Comment

Developed By SRK. Powered by Blogger.