BSNL సంస్థ కొత్తగా ఒక మొబైల్ వాలెట్ ని తీసుకు వస్తోంది.. అయితే ఇది మిగతా అన్ని రకాల wallets లాంటిది కాదు. కేవలం bsnl యూజర్లకు మాత్రమే లభిస్తుంది.
ప్రముఖ mobile wallet సంస్థ అయిన MobikWik సహకారంతో BSNL ఈ walletని ఈరోజు తీసుకు వస్తోంది. Mobikwik తరహాలోనే ఇది అన్ని రకాల మొబైల్ రీచార్జులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే వివిధ రకాల సర్వీసులకు bill payments కూడా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

మిగతా అన్ని ఆప్షన్లతో పాటు BSNL SIM కార్డుల కొనుగోలు, ఇతర BSNL ఉత్పత్తులను ఈ ప్లాట్ ఫామ్ ద్వారా పొందొచ్చు. అంటే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ రీఛార్జుల లాంటివన్నమాట.
ఈ సరికొత్త BSNL మొబైల్ వాలెట్ ని Mobikwik అభివృద్ధి చేసి ఆపరేట్ చేయిస్తుండగా BSNL సంస్థ దాన్ని మార్కెటింగ్, డిస్టిబ్యూషన్ చేస్తోంది.
ఆలోచన అయితే బాగానే ఉంది గానీ కేవలం BSNL యూజర్లకి మాత్రమే పనికొస్తుంది అంటే ఎంతమంది దీన్ని ఇష్టపడతారో ఆలోచించాల్సి ఉంది. ముఖ్యంగా Paytm లాంటి ప్రముఖ మొబైల్ వాలెట్ లను ఇప్పటికే కోట్లాదిమంది ఉపయోగిస్తున్నారు. వాటినుండి ఇలా పరిమిత ఆప్షన్లతో కూడిన వాలెట్ వైపు మొగ్గు చూపించడం కష్టమే.
Source: computerera.co.in

No comments:
Post a Comment